నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే నన్ను ఆశీర్వదించండి

– నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తా
– సీపీఐ(ఎం) ఖమ్మం అభ్యర్థి ఎర్రా శ్రీకాంత్‌
నవ తెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్‌
ఖమ్మం నగరంలో కూరగాయల మెయిన్‌ మార్కెట్‌లో, రోటరినగర్‌, టేకులపల్లి పలు ప్రాంతాలలో సీపీఎం ఖమ్మం నియోజవర్గ అసెంబ్లీ అభ్యర్ధి యర్రా శ్రీకాంత్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే తనను ఓటు వేసి ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఖమ్మంలో ప్రశ్నించే గొంతుక సీపీఎంకే ఓటేయండి అని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులువై.విక్రమ్‌ పిలుపునిచ్చారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని మెయిన్‌ కూరగాయల మార్కెట్‌లో సీపీఎం టూ టౌన్‌, ఖానాపురం హవేలీ మండల కమిటీల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యర్రా శ్రీకాంత్‌ మాట్లాడుతూ..ఖమ్మంలో రెండు కార్పొరేట్‌ శక్తులు ఎన్నికలలో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని, వారు ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాడారా అని ప్రజలు ఆలోచించి నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం పనిచేస్తున్న తనను గెలిపించాలని కోరారు.తాను సామాన్యుడిని అని, గత 35 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలో వారి సమస్యలపై పోరాడుతూ ఉన్నానని, ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం టూ టౌన్‌ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్‌, హవేలీ మండల కార్యదర్శి దొంగల తిరుపతిరావు, ఆయా మండలాల నాయకులు పిన్నిటి రమ్య, సత్తెనపల్లి శ్రీను, అమరావతి, నర్రా రమేష్‌, జే.వెంకన్నబాబు, భూక్యా. ఉపేందర్‌ నాయక్‌, యమ్‌.డి.గౌస్‌, సి.యచ్‌. భద్రం, షేక్‌. హుస్సేన్‌, పకిర్‌ సాబ్‌, బి.ముత్తయ్య, వీరప్ప, స్వామి, లక్ష్మయ్య, గుమ్మడి. బిక్షం పాల్గొన్నారు.