ఆశీర్వదించండి..అసెంబ్లీలో కొట్లాడుతా

ఆశీర్వదించండి..అసెంబ్లీలో కొట్లాడుతా– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి అర్జున్‌రావు
నవతెలంగాణ-అశ్వారావుపేట
సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే కార్మిక సంఘాలు బలపరిచిన అభ్యర్ధిగా నన్ను ఆశీర్వదించండి, మీ సమస్యలు పరిష్కారం కోసం అసెంబ్లీలో కొట్లాడుతా అని సీపీఐ(ఎం) అభ్యర్ధి పిట్టల అర్జున్‌ రావు తెలిపారు. గురువారం ఆయన అంగన్వాడీ కార్యకర్తలను ఓట్లు అభ్యర్ధించారు. ఆయన వెంట ముళ్ళ గిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావులు ఉన్నారు.
అర్జున్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం
దమ్మపేట : మండలంలోని పూసుకుంట గ్రామంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పిట్టల అర్జున్‌ రావు విజయం కోసం సీపీఐ(ఎం) నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డాలక్ష్మినారాయణ, మండల కార్యదర్శి శ్రీనివాసరావు, ములకలపల్లి మండల కార్యదర్శి రాంబాబు, మండల కమిటీ సభ్యులు వర్సాశ్రీరాములు, దినేష్‌ తదితరులు ప్రచారం చేపట్టారు.
అర్జునుని గెలిపించుకుందాం
చండ్రుగొండ : కార్మికుల పక్షాన పోరాడే అర్జునుని గెలిపించుకోవాలని సీఐటీయూ మండల కార్యదర్శి రామ అడుగు వెంకటాచారి కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలను ఓడించండి పోరాడే నాయకులను గెలిపించండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వెంకటేశ్వర్లు, రుక్మిణి, రమాదేవి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.