అంధత్వ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యం

సర్పంచ్‌ కంటే మాధవి శ్రీశైలం
చిల్కమర్రి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
అంధత్వ రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని, చూపు లేకుండా ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే కంటివెలుగు కార్యక్రమాన్ని కేసీఆర్‌ ప్రారంభించారని సర్పంచ్‌ కంటే మాధవి శ్రీశైలం అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని చిల్కమర్రి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్‌ కంటే మాధవి శ్రీశైలం పాల్గొని కంటివేలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చూపు లేకుండా బాధపడే వారు ఎవ్వరు ఉండకూడదని, అందరికీ కంటి చూపు అందించే సంకల్పంతో కంటి వెలుగు ఏర్పాటు చేశారని అన్నారు. 18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటుందని వివరించారు. దేశంలో కేసీఆర్‌ నాయకత్వం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను కేసీఆర్‌ ప్రవేశపెడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్‌, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, డాక్టర్‌ సంధ్యారాణి, ఆప్తోమెట్రిస్ట్‌ పార్థసారథి, డీఈఓ శంకర్‌, ఎఎన్‌ఎమ్‌లు నిర్మలా, మాధవిలత, ఆశా కార్యకర్తలు మల్లమ్మ, అరుణ, మంజుల, మహిళ సంఘం అధ్యక్షురాలు మంజుల, కారొబార్‌ నర్సింలు, గ్రామస్తులు సురేష్‌, ఆశన్న, జంగమ్మ, భీమమ్మ, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.