ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా బుధవారం ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని ఆదర్శ్‌ నగర్‌ కాలనీ కమ్యూనిటీహల్‌ నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్‌, ఉర్దూ యూనివర్సిటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రియాజ్‌ మాట్లాడుతూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ప్రతీ ఏడాది జూన్‌ 14న రక్తదాతల దినంగా ప్రకటించి, అమలు చేస్తుందన్నారు. రక్తదానం చేసేందుకు ప్రజల్ని చైతన్య పరచడంలో ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేస్తుం దన్నారు. రక్తదానంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరించి, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియ జేశారు. అనంతరం ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికి ఆత్మీయ సత్కారాలు నిర్వహించారు. రక్తం శరీరానికి ఇంధనం లాంటిదన్నారు. పౌష్టికాహార లోపం ఉన్నవారికి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి, రోడ్డు ప్రమాదాలలో గాయపడి రక్తస్రావం అయిన వారికి, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు, మహిళలకు ప్రసవ సమయంల్లో యుద్ధ సమయంలో క్షతగాత్రులైన సైనికులకు రక్తం అవసర పడుతుందన్నారున. తరచుగా రక్తదానం చేసేవారికి అధిక బరువు నుంచి విముక్తి, రోగ నిరోధక శక్తి పెరగడం, కొలెస్ట్రాల్‌ , ఐరన్‌ శాతం తగ్గి గుండె జబ్బులు, కాన్సర్‌ భారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు మల్లారెడ్డి, జి. రావు, జనార్ధన్‌, అమ్మయ్యచౌదరి, మహేష్‌ రెడ్డి, మహేష్‌ యాదవ్‌, వాణి సాంబశివరావు, బాలన్న, శ్రీ చందన, బోయిన అనూష యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.