బిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం. తల్లిపాలు, పాపాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో విటమిన్‌లు, మినరల్స్, ప్రొటీన్‌లు, కార్బోహైడ్రేట్లు.. వంటి ఎన్నో పోషకాలతో పాటు చిన్నారి శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి వారి ఆరోగ్యానికి, ఎదుగుదలకు చాలా అవసరం. తల్లి, బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లీబిడల మధ్య బంధం మరింత దఢమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. పాలివ్వడం వల్ల పిల్లలకే కాదు, తల్లికీ మేలు జరుగుతుంది. పాలు పట్టడం వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల పాలిచ్చేప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో తెలుసుకుందాం…