ఆస్తి గొడవలో అన్నపై తమ్ముడు దాడి

తమ్ముడిపై చర్యలకు డిమాండ్‌
నవతెలంగాణ-గండిపేట్‌
అన్నదమ్ముల ఆస్తి గొడవలు అన్న పైన తమ్ముడి దాడి చేసిన ఘటన నార్సింగి పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట్‌ మండల్‌ నార్సింగి మున్సిపాలిటీ ఖానాపూర్‌ గ్రామానికి చెందిన అమిత్‌ (60) గ్రామంలో ఇంటి నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. 15 ఏండ్ల తరువాత వచ్చి ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం తమ్ముడు బాబా చేశారు. ఈ విషయం పైన అన్న గతంలోనే నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో తమ్ముడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. అన్న పైన ఆస్తి గొడవ కోసం బండరాయితో చంపడానికి తమ్ముడు ప్రయత్నం చేసినట్టు ఆరోపిస్తున్నారు. అన్న గాయపడడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అన్నపై దాడి చేసిన తమ్ముడు పైన చర్యలు తీసుకొని అన్నకు న్యాయం చేయాలని ఖానాపూర్‌ గ్రామస్తులు కోరారు.