కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్

నవతెలంగాణ ఖమ్మం: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో త్రీటౌన్ ప్రాంతంలోని స్థానిక 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల విజయలక్ష్మి, వెంకన్న బీఆర్ఎస్ పార్టీ వీడి ఖమ్మం నియోజవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ తో కలిసి కార్పొరేటర్ గజ్జల విజయలక్ష్మి ,వెంకన్న దంపతులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిశారు. ఈ సందర్భంగా తుమ్మల వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.