– మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
– హామీలకు అనుగుణంగా బీడీ కార్మికులకు,ఒంటరి మహిళలకు పింఛన్లు
– అంగన్ వాడి ఉద్యోగులకు వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్
– పోలీస్ శాఖలో, మార్కెట్ కమిటీ లలో మహిళలకు 33 % రిజర్వేషన్
– తెలంగాణ మహిళ సంక్షేమ దినోత్సవం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ గార్డెన్స్ లో తెలంగాణ మహిళ సంక్షేమ దినోత్సవం లో మంగళవారం పాల్గొన్నారు. మహిళ సంక్షేమ దినోత్సవం లోఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..స్వరాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళ సంక్షేమానికి,మహిళల భద్రత,మహిళల రక్షణ కొరకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు.మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లు అందిస్తున్నారు.మహిళలకు అన్ని రంగాల్లో రాణించడడానికి వివిధ రకాల కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తుంది.మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించాలని మహిళ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.మహిళలలో దాగివున్న ప్రతిభను వెలికితీసి సరికొత్త ఆవిష్కరణలు,పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వి-హబ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.దేశంలో మొట్ట మొదటిసారిగా షి టాక్సీ పథకం ద్వారా మహిళ ప్రయాణికుల భద్రత కల్పించడం కోసం, మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించడానికి మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ అందించి సబ్బిడిలో వాహనాలు అందిస్తుంది ప్రభుత్వం.గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం లోపం తో భాధపడకుండా గర్భిణీ స్త్రీలకు, పిల్లల పోషణ కోసం ఆరోగ్యాలక్ష్మి పథకం ప్రారంభించింది ప్రభుత్వం. తద్వారా పిల్లలలో,తల్లులలో రక్త హీనత, పౌష్టికాహారం లోపం వాటిల్లకుండా మాత శిశు మరణాలు తగ్గాయి. అంగన్ వాడి సిబ్బంది శ్రమని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వేతనాలు పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.బస్తి ధవాఖానాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో మహిళల కొరకు మహిళ క్లినిక్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. క్యాన్సర్ నిర్ధారణ పరిక్షాలతో పాటు ఇతర రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం.గర్భిణి స్త్రీ ల ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం కోసం ఆశ వర్కర్లను ఇంటికి పంపి అవసరమైన వైద్య సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవం జరిగితే 12000 రూ. కేసీఆర్ కిట్ని అందిస్తుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకవచ్చిన వైద్య సదుపాయాలు, సంక్షేమ పథకాల వల్ల,వైద్య సిబ్బంది సహకారంతో, ఆరోగ్య కార్యకర్తల కృషి వల్ల దేశంలోనే అత్యధికంగా ప్రసవాలు తెలంగాణ లోని ప్రభుత్వ ఆసుపత్రి లలో జరుగుతున్నాయి.బాలికలకు గురుకుల పాఠశాలల ద్వారా సంవత్సరానికి 1 లక్షల 20 వేయిల రూ.ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుంది ప్రభుత్వం.కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకాల ద్వారా ఘనంగా అడా బిడ్డల పెండ్లి.అడా బిడ్డ పుట్టిన మగ బిడ్డ పుట్టిన స్వాగతించాలని ఒక వేళ లింగ నిర్ధారణ చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం.ఒంటరి మహిళలకు,బీడీ కార్మికులకు,వితంతు మహిళలకు సామాజిక భద్రత కల్పించడానికి ఆసరా పింఛన్లు ఇస్తుంది.మహిళలకు సంక్షేమానికి,భద్రతకు, రక్షణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్,రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ ,ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకురాలు ప్రతిమ రాజ్ రెడ్డి ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ,కార్పొరేటర్ లు నిచెంగు లత,మాయవార్ సవిత,కంపల్లి ఉమారని,మరాఠీ యమున పంచారెడ్డి నర్సుభాయ్,బంగారు నవ నీత, బి.ఆర్.ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు గంగమని,మెప్మా సిబ్బంది,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది,మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.