ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్

సోషల్ మీడియా ఇంచార్జి
నవతెలంగాణ మల్హర్ రావు: బీఆర్ఎస్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలిపించాలని మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి అక్కినేని సుమన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా ఎడ్లపల్లి గ్రామంలో గురువారం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిపేస్టో ను గడప గడపకు పంపిణీ చేశారు. పుట్ట మదుకర్ ను గెలిపిస్తే బీఆర్ఎస్ పథకాలతోపాటు,పేదల కోసం తన సొంత స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వెంకట్ రాజు, అక్కినవేని శ్రీనివాస్, తోట రమేష్, మంథని బుచ్చయ్య, మంథని బాపు, తోట రాజేశ్వర్ రావు, వేల్పుల రాజేందర్, కుక్కల రాజబాబు, తోట రాజ సమ్మయ్య పాల్గొన్నారు.