నవతెలంగాణ- వైరా
వైరా నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలోత్ రాందాస్ నాయక్‌ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగానే బీఆర్‌ఎస్ నాయకులు మూకుమ్మడిగా రాందాస్ నాయక్‌ను కలిసి సంఘీభావం తెలపటమేగాక మంగళవారం ఉదయం నుండి ప్రజలను కలుసుకోవటంలోనూ, దేవాలయాల్లో పూజల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుత బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మదన్‌లాల్‌కు ముఖ్య అనుచరుడు అయిన సిరిపురం (కె జి) గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు మచ్చా వెంకటేశ్వరరావు (బుజ్జి) వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బిడి కె రత్నం, వైరా మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రాయల రమేష్, గన్నవరం సర్పంచ్ వేమిరెడ్డి విజయలక్ష్మి, ఆమె భర్త వెంకట కోటారెడ్డి, గోవిందా పురం సర్పంచ్ బుద్దా సురేష్, కొండ కుడిమ గ్రామ సర్పంచ్ దొంతిబోయిన శ్రీనివాసరావులు పాల్గొనటం బిఆర్‌ఎస్ పార్టీకి షాక్ అని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాందాస్ నాయక్‌తో పాటు వీరంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు, మార్క్‌ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రాందాస్ నాయక్ వెంట వైరా మునిసిపల్ 2వ వార్డు కౌన్సిలర్ బత్తుల గీతా, వైరా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, దాసరి దానేలు, బోళ్ళ గంగారాం, ఏదునూరి సీతారాములు, పమ్మి అశోక్ తదితరులు పాల్గొన్నారు.