నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల జనార్దన్ గార్డెన్స్ లో విశ్వ బ్రహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ లో ఉప్పల్ భగయత్ లో విశ్వ బ్రాహ్మణులకు భూమి కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కూడామంజూరు చేశారు.నగరం లోని ప్రతి విశ్వ బ్రాహ్మణుల సంఘం కమ్యూనిటీ హల్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసాను. నిజామాబాద్ నగరం లో బిసి కులస్తులకు అందించే 1 లక్ష రూ.ల ఆర్థిక సహాయాన్ని విశ్వ బ్రహ్మణులకు అందించాము.నాగారం లో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం శ్రీ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని :నిర్మిస్తాము.కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాము.అభివృద్ధి లో భాగంగా నిజామాబాద్ నగరం లో ఐటి టవర్ నిర్మించి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పించి స్థానిక యువతకు కల్పించాము.25 కోట్ల రూ.లతో రైల్వే కమాన్ వద్ద ఆర్ యు బి నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చాము.మరణించిన వ్యక్తిని గౌరవంగా సాగనంపేందుకు అధునిక సదుపాయాలతో వైకుంఠ దామలు నిర్మించాము.సరికొత్త హంగులతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేసాము.పాలన సౌలభ్యం కొరకు నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ భవనాలను నిర్మించాము.ప్రధాన రోడ్ల తో సహా అంతర్గత రోడ్లను మెరుగుపరిచాము.బి. ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 400 రూ.లకు వంట గ్యాస్,రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తాము. ఆసరా పింఛన్లు విడతల వారిగా 5000/- రూ.లకు పెంచుతాము.ఆరోగ్య శ్రీ పరిమితిని 15 లక్షల వరకు పెంచుతాము.మీరు మరోసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ , బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు వి.సత్య ప్రకాష్, రేసు హానుమాండ్లు,చిరంజీవ చార్యులు,గుత్ప సదనంద్ చారి, కటకం ప్రభు చారి తదితరులు పాల్గొన్నారు.