– మరాఠీ బహుసాత్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ కుమార్ జీతెన్
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న మరాఠీలు ఉన్నారని, అక్కడి స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు దిలీప్ ఘనాటేకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మరాఠీ భహుసాత్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ కుమార్ జెతెన్ కోరారు. ఆదివారం బొగ్గులకుంటలోని చెంప ఎస్టేట్స్‌లోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోషామహల్ నియోజకవర్గంలో 25 వేలకు పైగా మరాఠీ ఓటర్లు ఉన్నారని, నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ పటిష్టతకు దిలీప్ ఘనాటే ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాంటి వారికి బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. సమావేశంలో సమాజ్ ఉపాధ్యక్షులు డాక్టర్ విజరు రాన్, ట్రెజరర్ అశ్విన్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.