బాలానగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాధు వెంకట్ రెడ్డి , మాజీ సర్పంచ్ సొంలా నాయక్, మాజీ ఉప సర్పంచ్ కష్ణయ్య సుడిగాలి పర్యటనలో భాగంగా బాలానగర్ మండలంలోని పెద్దరేవెల్లి గ్రామంలో బుధవారం భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 మంది బీఆర్ ఎస్ నాయకులు అభివృద్ధి చేయకుండా కేవలం మాటలు చెప్పే పార్టీలో ఉండలేమని, అందుకే కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బాలానగర్ మండలలోని తిమ్మరెడ్డి పల్లి,దేవునిగుట్ట తంట,పెద్దరేవల్లిలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రజలు పెద్ద ఎత్తున చేరారు. మాజీ మండల అధ్యక్షులు ఆదిరమణారెడ్డి యాదయ్యగౌడ్‌తో పాటు పలువురు ఆయన వెంబడి ఉన్నారు. అనంతరం సాధు వెంకట్రెడ్డి మాట్లాడుతూ బాలానగర్ జాతీయ రహదారి నుంచి డబుల్ రోడ్డు చేస్తానన్న ఎమ్మెల్యే నేటి వరకు చేయలేదన్నారు. ఈ రోడ్డు గుంతలమయం కావడంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు అందుకే పెద్ద రేవెల్లి గ్రామానికి ఒక్క అభివద్ధి పని కూడా చేయలేదని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
గండీడ్ : పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జంగం రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామంలో మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,జన్మదిన వేడుక నిర్వహించారు. కార్యక్రమంలోఎంపీటీసీబాలయ్య,శ్రీనివాస్ రెడ్డి, గ్రామ యువకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.