పశ్చిమ దేశాల లెఫ్ట్‌ – అమెరికా, చైనాల వైరుధ్యం

The US-China conflictపశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టేతర వామపక్షాలు అమెరికాకు, చైనాకు నడుమ నెలకొన్న శతృత్వాన్ని రెండు సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యంగా పరిగణిస్తున్నాయి. ఆ విధంగా పరిగణించడం ద్వారా అవి తమ సైద్ధాంతిక దృక్కోణాన్ని మూడు విధాలుగా సమర్ధించుకుంటున్నాయి. మొదటిది: అమెరికాకు, చైనాకు నడుమ వైరుధ్యం ఎందుకు పెరుగుతోందో వివరించగలుగుతున్నాయి. రెండవది: అందుకోసం అవి లెనినిస్టు అవగాహనను లెనినిస్టు సిద్ధాంత చట్రంలో ఉపయోగిస్తున్నాయి. మూడవది: చైనా ఒక ఎదుగుతున్న సామ్రాజ్యవాద దేశంగా విమ ర్శించడం ద్వారా చైనాలో ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతోందన్న తమ అతి-వామపక్ష (అల్ట్రా-లెఫ్ట్‌) విమర్శను సమర్ధించుకుంటున్నాయి.
ఈ తరహా విమర్శ ద్వారా ఆ వామపక్ష శక్తులు తెలిసో, తెలియకో చైనాకు వ్యతిరేకంగా అమెరికన్‌ సామ్రాజ్యవాదం సాగిస్తున్న కుట్రలకు తోడ్పడుతున్నాయి. అమెరికా, చైనాలు రెండూ సామ్రాజ్యవాద దేశాలే గనుక వాటిలో ఒకదానికి వ్యతిరేకంగా రెండో దేశాన్ని బలపరచడం లో అర్ధం లేదన్న నిర్ధారణకు వారి వాదనలు దారి తీస్తాయి. ఇంకాస్త దారి తప్పితే ఆ రెండు దేశాల్లోనూ తక్కువ ప్రమాదకారిగా ఉన్న అమెరికాను సమర్ధించి చైనాను వ్యతిరేకించడానికి కూడా దారి తీయవచ్చు. ఏ విధంగా చూసినా ఆ వైఖరి చైనా విషయంలో అమెరికా అవలంబిస్తున్న దూకుడును వ్యతిరేకించాల్సింది పోయి, గందరగోళ పరుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు దేశాలూ అనేక వర్తమాన పరిణా మాలపై పరస్పరం తలపడుతున్నాయి. ఆ సందర్భాలలో అమెరికన్‌ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వైఖరి తీసుకునే బదులు మౌనం వహించడానికి దారి తీస్తుంది.
పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద శక్తులను మామూలుగా వ్యతిరేకించే వామపక్షాలు (పశ్చిమ దేశాలలోనివి) సైతం ఆ సామ్రాజ్యవాదం తీసుకుంటున్న చర్యలను సమర్ధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. స్లోబోడెన్‌ మిలోసెవిచ్‌ సెర్బియాను పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశంపై బాంబుల దాడికి సామ్రాజ్యవాదులు పూనుకున్నప్పుడు ఆ విధంగానే సమర్థించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధంలో కూడా ఉక్రెయిన్‌కు నాటో దేశాల మద్దతును సమర్ధిస్తున్నారు. దిగ్భ్రమ గొలిపే విధంగా గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ సామ్రాజ్య వాదుల మద్దతుతో కొనసాగిస్తున్న మానవ హననాన్ని వాళ్లు వ్యతిరేకించడం లేదు. చైనా విషయంలో సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న దూకుడు విషయంలో పశ్చిమ దేశాల వామపక్ష శక్తుల వైఖరి పెద్దగా భిన్నంగా లేకపో వడం కూడా ఈ ధోరణిలో అంతర్భాగమే.
సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో శ్రామికవర్గపు ధోరణులకు, వారి ప్రయోజనాలకు అక్కడి వామపక్ష శక్తులు సామ్రాజ్యవాదం విషయంలో అనుసరిస్తున్న వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడి కార్మికవర్గం ఉక్రెయిన్‌లో నాటో కొనసాగిస్తున్న పరోక్ష యుద్ధాన్ని చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఉక్రెయిన్‌లో ఉపయోగించడానికి ఉద్దేశించిన ఆయుధాలను ఓడలకెక్కించడానికి యూరోపి యన్‌ కార్మికులు వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత అంత ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా యూరప్‌ లో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగి అక్కడి కార్మికులమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆ యుద్ధాన్ని అక్కడి వామపక్షాలు వ్యతిరేకించకపోవడంతో ఆ కార్మికులు చాలామంది ఇప్పుడు మితవాద ప్రతిపక్ష పార్టీల వైపు సానుకూలతను ప్రదర్శిస్తున్నారు. ఈ మితవాద పార్టీలు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకమేమీ కాదు. కాని అవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని విమర్శిస్తూంటాయి (ఇటలీలో మెలనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాదిరిగా చేశాడు. అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదాన్ని పూర్తిగా బలపరుస్తున్నాడు.) ఈ పరిస్థితుల్లో పశ్చిమ దేశాల్లో వామ పక్ష శక్తులు సామ్రాజ్యవాదం పట్ల మెత్తగా వ్యవహరించడం వలన అక్కడి రాజకీయ బలాబలాలు మితవాదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి.
చైనా ఒక పెట్టుబడిదారీ దేశం అని, అందుచేతనే ప్రపంచ వ్యాప్తంగా తన సామ్రాజ్యవాద కార్యకలాపాలను విస్తరించే క్రమంలో అమెరికాతో వైరం పాటిస్తోందని భావిస్తున్నవారు ”పెట్టుబడిదారీ” అంతా ”చెడ్డది” అని, ”సోషలిస్టు” అంతా ”మంచిది” అని కలగా పులగం చేస్తున్నారు. ”నా దృష్టిలో సోషలిజం అనేది ఏ విధంగా ఉం టుందో (అది ఒక ఆదర్శప్రాయమైన దృష్టి) ఇప్పుడు కొన్ని విషయా లలో చైనాలో అందుకు భిన్నంగా జరుగుతోంది గనుక చైనా సోష లిస్టు దేశం కాజాలదు. కనుక చైనా పెట్టుబడిదారీ దేశమే” అనే విధం గా వారి అభిప్రాయం ఉంటుంది. ”పెట్టుబడిదారీ”, ”సోషలిస్టు” అనే పదాలకు నిర్దిష్టమైన అర్ధాలు ఉన్నాయి. నిర్దిష్టమైన గతి సూత్రాలతో అవి ముడిపడి వున్నాయి. కొన్ని మౌలిక ఆస్తి సంబంధాలలో అవి వేళ్ళూనుకుని ఉన్నాయి. చైనాలో పెట్టుబడిదారీ రంగం గణనీయం గా ఉందన్నమాట నిజం. అంటే అక్కడ కొన్ని పెట్టుబడిదారీ ఆస్తి సం బంధాలు ఉన్నాయి. ఐతే చైనా ఆర్థిక వ్యవస్థలో అత్యధిక భాగం ప్రభు త్వ ఆధీనంలో ఉంది. అదంతా కేంద్రీకృతంగా నిర్దేశించబడుతోంది. అందుచేత ”సద్యోజనిత” (స్పాంటేనియస్‌) స్వభావంతో స్వయంచ లితంగా ఉండే పెట్టుబడిదారీ ధోరణిలోకి అది జారిపోకుండా ఉంచు తోంది. చైనా ఆర్థిక వ్యవస్థలో, అక్కడి సమాజంలో జరుగుతున్న వాటిలో చాలా అంశాలను ఎవరైనా విమర్శించవచ్చు. కాని అది మొత్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అని నిర్ధారించి, అందుచేతనే సామ్రాజ్యవాదులతో సరిసమానంగా తానూ అదే తరహాలో వ్యవ హరిస్తోందని చెప్పడం సత్యదూరం ఔతుంది. అది విశ్లేషణపరంగా పొరపాటు మాత్రమే కాదు. ఆచరణలో అటువంటి అవగాహన అటు సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో, ఇటు మూడవ ప్రపంచ దేశాలలో ఉన్న కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నమైన దిశలో కార్యాచరణకు దారి తీస్తుంది.
ఐతే ఇక్కడ ఒక ప్రశ్న వెంటనే ఉత్పన్నమౌతుంది. అమెరికా- చైనాల నడుమ వైరుధ్యం రెండు సామ్రాజ్యవాద దేశాల నడుమ ఉండే వైరుధ్యం కాకపోతే, ఇటీవల కాలంలో అది అంత ప్రముఖంగా ఎందుకు ముందుకొచ్చింది? దీనిని తెలుసుకోవాలంటే మనం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెనువెంటనే ఉన్న కాలానికి వెళ్ళాలి. ఆ యుద్ధంలో పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా బలహీనపడింది. తన ఉనికే కొనసాగదేమో అన్నంత వాతావరణం ఏర్పడింది. సంపన్న పెట్టుబడి దారీ దేశాల్లోని కార్మికవర్గం యుద్ధానికి ముందున్న భారీ స్థాయి నిరు ద్యోగాన్ని గాని, దారిద్య్రాన్ని గాని భరించడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. మరోపక్క సోషలిజం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పురోగమిం చింది. వలస, అర్థవలస పాలనకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాల్లో విముక్తి పోరాటాలు తారాస్థాయికి చేరాయి. తన మనుగడను నిలుపుకోడం కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా రాయితీలు ఇవ్వక తప్ప లేదు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రభుత్వ సంక్షేమ చర్యలు, మార్కెట్‌లో కొనుగోలు శక్తిని నిలబెట్టడం కోసం ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యం, అన్నింటికీ మించి వలస దేశాల రాజకీయ స్వాతంత్య్రాన్ని అంగీకరించడం జరిగాయి.
పెట్టుబడి కేంద్రీకరణ ఉన్నత స్థాయికి చేరి, అంతర్జాతీయ పెట్టు బడి, ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి రూపం తీసు కోవడం తో పరిస్థితి మళ్ళీ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా మారింది. దానికి సోవియట్‌ యూనియన్‌ పతనం తోడైంది. ఈ సోవియట్‌ పతనం సైతం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పాత్ర లేకుండా జరి గినది కాదు. ప్రపంచీకరణ ఉచ్చులోకి దేశాలను లాగి, ప్రపంచవ్యాప్త ద్రవ్య పెట్టుబడి ప్రవాహాల వేగానికి అవి లోబడేలా చేసింది సామ్రా జ్యవాదం. నయా ఉదారవాద విధానాలను గనుక ఆ దేశాలు అమలు చేయకపోతే ఆ అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కి పోతాయని బెది రించి ఆ విధానాలు అమలు జరిగేట్టు చేసింది. దాని ఫలితంగా ఆ యా దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభుత్వ నియంత్రణ కింద నడిచే పరిస్థితి లేకుండా పోయింది. మూడవ ప్రపంచ దేశాల వనరుల్లో చాలా భాగం మళ్ళీ సామ్రాజ్యవాదుల ఆధీనంలోకి వచ్చి చేరింది. ఆ మూడో ప్రపంచ దేశాలలో భూమిని ఏ విధంగా వినియోగించాలన్నది సైతం సామ్రాజ్యవాదమే నిర్దేశిస్తున్నది.
సామ్రాజ్యవాద పెత్తనం మళ్ళీ బలపడిన నేపథ్యంలో మనం అమెరికా-చైనాల నడుమ వైరుధ్యాన్ని చూడాలి. ఉక్రెయిన్‌ యుద్ధంతో సహా అనేక వర్తమాన పరిణామాలను కూడా ఈ నేపథ్యంలోనే చూడాలి. సామ్రాజ్యవాదం తిరిగి బలపడిన తీరులో రెండు ధోరణులు కనపడతాయి: మొదటిది: చైనా తదితర దేశాల నుండి వచ్చే సరుకులకు సంపన్న దేశాలలో ప్రవేశానికి అవకాశం కల్పించడం, సంపన్న దేశాల నుండి చైనా వంటి దేశాలకు పరిశ్రమలను తరలించడం. ప్రపంచ డిమాండ్‌ను అందుకోడానికి వీలుగా ఆ దేశాలలో చౌకగా లభించే కార్మిక శ్రమశక్తిని వాడుకోవడం దీని ఉద్దేశ్యం. దీని ఫలితంగా చైనా తదితర దేశాల ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంది (ఏదేశాలలోకి సంపన్న దేశాల పరిశ్రమలను తరలించారో, ఏ దేశాల నుండి సంపన్న దేశాలు సరుకుల ప్రవేశానికి అనుమతించాయో ఆ దేశాలలో మాత్రమే). చైనాలో ఆర్థిక పురోగతి ఏ స్థాయికి చేరిందంటే ఆఖరికి అమెరికా కూడా చైనా తనకు ప్రమాదకారిగా తయారు కాగలదని భావించసాగింది. రెండవ ధోరణి: అమెరికాలో ”హౌసింగ్‌” బుడగ పేలిపోయి, దాని పర్యవసానాలు అంటువ్యాధి మాదిరిగా మొత్తం నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థనే చుట్టుముట్టి సంక్షోభంలోకి నెట్టింది.
ఈ రెండు కారణాల రీత్యా, ఇప్పుడు అమెరికా తన ఆర్థిక వ్యవస్థను చైనా, తదితర దేశాల నుండి వచ్చిపడే దిగుమతుల నుండి రక్షించుకోవాలని చూస్తోంది. ఇప్పటిదాకా, ఈ దిగుమతుల వెనక ప్రధాన పాత్ర అమెరికన్‌ పెట్టుబడిదే. ఐనప్పటికీ, అవి అదే మాదిరిగా కొనసాగితే అమెరికాలోని పరిశ్రమలు మూతబడక తప్పదు. మొదట్లో చైనాలో చేపట్టిన ”ఆర్థిక సంస్కరణలను” చాలా గొప్పగా శ్లాఘించిన అమెరికా ఇప్పుడు చైనా ”తోక కత్తిరించాలని” మాట్లాడుతోంది. ఈ మార్పు వెనుక నయా ఉదారవాద వ్యవస్థ కూరుకు పోయిన సంక్షోభం పాత్ర ఉంది. అందులోంచి బయటపడడానికి మళ్ళీ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి. అదొక్కటే దాని ముందున్న దారి. కాని, చైనా, ఆ దేశం ప్రేరణతో మరికొన్ని దేశాలు ఆ ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి. అమెరికా, చైనాల నడుమ వైరుధ్యం పెద్దదవడానికి వెనుక ఇదే కారణం.
పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ, మూడవ ప్రపంచ దేశాలను అణచివేయడం కూడా పెరుగుతుంది. సామ్రాజ్యవాద ఒత్తిళ్ళకు తలొగ్గి ఈ దేశాలు అమలు చేస్తున్న ”పొదుపు చర్యల” ఫలితంగా తాము చెల్లించవలసిన విదేశీ రుణ వాయిదాలను చెల్లించలేని స్థితిలో మూడవ ప్రపంచ దేశాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటికి చైనా సహాయం అందిస్తోంది. ఆ తోడ్పాటు అందుకుంటున్న మూడవ ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని ప్రతిఘటిస్తున్నాయి. దాంతో అమెరికా- చైనా వైరుధ్యం మరింత తీవ్రం కానుంది. దాంతోపాటు చైనా వ్యతిరేక ప్రచారమూ పశ్చిమ సంపన్న దేశాలలో మరింత ఎక్కువ కానుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love
Latest updates news (2024-05-20 11:09):

nf5 how many viagra can you take in a month | too much P8J masturbation erectile dysfunction | best over the bPH counter viagra type pills | how to stay long on bed with VcW partner | ksx male G6t enhancement pills reviews | viagra is not working uLo on me | for sale squeeze sex | does libido Sbc max make you last longer | how to ejaculate large volume p6m of sperm | can i take viagra with antidepressants TQd | safe way to KpD buy viagra online | erectile dysfunction lyrics pink Sag guy | any new kind of medicine or lQL creams for erectile dysfunction | mens viagra doctor recommended tablets | sex cream how to use u5R | braggs apple cider vinegar for Tkq erectile dysfunction | i69 medicines and drugs hd | how to make alovera gel Oz4 and honey for male enhancement | blood vNS pressure medicine and ed | bliss go pack side effects bw9 | viagra does it really work WRB | brain sustain reviews free trial | is levitra stronger RJq than viagra | erectile dysfunction doctors naples 1Sk fl | viagra J3O headache next day | rogaine liquid fJX or foam | knox a trill male enhancement tQM pills | best blood pressure Cdp medication for erectile dysfunction | can you take more than P6c 100mg viagra | best sAK erectile dysfunction pills reviews | do vasectomies cause erectile 5wk dysfunction | how to get a bigger xvt erection | does james charles have xqD a penis | gas station counter for sale | male anxiety prolong pills | ljP best online viagra pharmacy reviews | elderly free trial male enhancement | stree overlord exceed alY viagra and cialis | top 10 jNb libido boosters | male enhancement as seen HeN on shark tank | viagra cbd oil discovered | wc6 cardiovascular causing erectile dysfunction | do electric penis pumps Lr8 work | q58 viagra para hombres sin efectos secundarios | baidyanath jm3 churna for erectile dysfunction | xmT ibuprofen and erectile dysfunction | little girl with l00 big butt | sex problem zcM and solution in ayurveda in hindi | male jMy stimulants over the counter | how to naturally zDE boost testosterone after 40