విద్యుత్ఘాతంతో గేదె మృతి

నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ఘాతం తో ఓ గేదె మృతి చెందిన ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అచ్యుతాపురం పంచాయితీ దిబ్బ గూడెం సమీపంలో ఓ రైతు పొలంలో విద్యుత్ వైరు తెగి పడి ఉండగా,మేత కు వెళ్లిన అచ్యుతాపురం కు చెందిన రాచూరినాగు కు చెందిన సూడి గేదె విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడిక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.1లక్ష ఉంటుందని, బాధిత రైతు వాపోతున్నాడు.