
నవతెలంగాణ దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రధాన ఆలయంలోకి చొరబడి హుండీ ధ్వంసం చేసే ప్రయత్నం చేయగా అది రాకపోవడంతో బయట ఉన్న హుండీ పగలగొట్టి అందులో ఉన్న సుమారు 8వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ గర్భగుడిలో ఉన్న దేవత మూర్తుల విగ్రహాలపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు. ఉన్నటువంటి ఒక్కసారిగా దొంగలు బీభత్సం సృష్టించడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. లక్షెట్టిపేట సిఐ కృష్ణ, దండేపల్లి ఎస్సై ప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. మంచిర్యాల నుండి క్లూస్ టీం సిబ్బందిని పిలిపించి చేతి వేలిముద్రల నమూనాలను సేకరించారు. వీలైనంత తొందరలో దొంగలను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఇటీవలే సమీప జిల్లాలో ని దేవాలయంలో చోరీ జరిగినట్లు సమాచారం ఉందని వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని సిఐ కృష్ణ అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తిస్తామని తెలిపారు. అనంతరం ఆలయ నిర్వహణ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదే మాదిరిగా గతంలో ఒక్కసారి ఆలయంలో దొంగతనం జరిగినట్టు తెలిపారు. ఆలయ మొత్తం సీసీ కెమెరాలు అమర్చినట్లు పేర్కొన్నారు. ఆలయానికి భద్రత పెంచే దిశగా కృషి చేస్తారని తెలిపారు.