సీజనల్‌ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి

– మండల వైద్యాధికారి ప్రియాంక
నవతెలంగాణ-యాచారం
వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి ప్రియాంక సూచించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ నాలుగు రోజు లుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తో అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంద న్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పారు. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోవాలని వివరించారు. ఏదైనా జలుబు, జ్వరం, వాంతులు వంటివి వస్తే సెల్ఫ్‌ వైద్యం తీసుకోకుండా డాక్టర్‌ను సంప్రదించాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.