నవతెలంగాణ -కొత్తగూడెం
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ అని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చైర్ చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో సాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మెరుగు విద్యాలత, ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి. నాగలక్ష్మీ, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ కార్యాలయంలో….
ఐలమ్మ పోరాటాలు నేటి తరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక శేషగిరిభవన్‌లో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, వై శ్రీనివాసరెడ్డ్డి, సలిగంటి శ్రీనివాస్, మహిళా సమాఖ్య నాయకురాళ్లు విజయలక్ష్మి, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో…..
ఐలమ్మ పోరాటం నిలిచిందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.జి అన్నారు. ఎస్పీ కార్యాలయలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ ఇ.విజరు బాబు, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి, సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య, ఏవో జయరాజు, ఎస్బి ఇన్పెక్టర్స్ నాగరాజు, రాజువర్మ, ఆర్‌ఐలు రవి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంధాలయంలో….
వీర వనిత స్త్రీ ధైర్యశాలి చాకలి ఐలమ్మని చైర్మన్ దిండిగల రాజేందర్ అన్నారు. చాకలి ఐలమ్మ 128వ పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థలలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాపాలకురాలు జి.మణి మృదుల, గ్రంథాలయ సిబ్బంది పాఠకులు విద్యార్థినీ విద్యార్థులు మునీర్, శివ, నవీన్, జయరాం తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన ఐలమ్మ జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంగం జిల్లా కార్యదర్శి సిహెచ్ ముసలయ్య, రజక సంగ రాష్ట్ర జేఏసీ యూత్ ప్రెసిడెంట్ పోగుల లక్ష్మినారాయణ, జాతీయ బీసీ సంక్షేమ సంగం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు ముదురు కోళ్ల కిషోర్, బండి రాజు గౌడ్, వివిద సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూడీసీ నరసింహారావు, ఏపీఓ రామచంద్ర రావు, వినరు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, కార్యాలయం సిబ్బంది, పాల్గొన్నారు.
అశ్వారావుపేట : రజక వృత్తి దారుల సంఘం అధ్యక్షులు బుక్కూరి బుచ్చిబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ముందుగా మైసమ్మ గుడి దగ్గర నుండి పట్టణంలో ప్రధాన రహదారి పై భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. అనంతరం రజకుల సమస్యలపై వినతి పత్రాన్ని తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్‌కు అందజేసారు. ఈ కార్యక్రమంలో రజక వత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాస్, శివ కుమారి, రామకృష్ణ, ప్రదీప్, రాంబాబు, నాగయ్య, సాయి,ఆదినారాయణ, శ్రీను, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం : మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తొలుత సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చెన్నూరి అంతయ్య ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెడవరపు సుధీర్ కార్యదర్శి ప్రవీణ్, చెన్నురి వెంకన్న, ఆవనగంటి సమ్మయ్య , రేపల్లె రాములు, రాసమళ్ళ ఎల్లయ్య, చిటికెన రమేశ్, శిరీష, పాల్గొన్నారు.