నవతెలంగాణ- (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో శనివారం రాత్రి గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో 25 అడుగుల ఎత్తయిన బతుకమ్మతో ఉత్సవాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్వేత గంగారెడ్డి, వీడీసీ సభ్యులు, గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు నిర్వహించినారు.