ప్రజల సంక్షేమం కోసం నిరంతర పోరాటం: చాడ వెంకటరెడ్డి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్: ప్రజల సంక్షేమం కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని  సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతం అంటేనే చైతన్యవంతమైనదని, గతంలో మాదిరిగా హుస్నాబాద్ లో భారత కమ్యూనిస్టు పార్టీకి పునర్వైభవం తీసుకొస్నానని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తూ,ప్రశ్నిస్తున్న మేధావుల, ప్రజాస్వామిక వాదులను దేశద్రోహం పేరుతో ఉపా చట్టం కేసులు మోపి అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాగీర్  సత్యనారాయణ, కొయ్యడ సృజన్ కుమార్, యెడల వనేశ్, కొమ్ముల భాస్కర్, ముంజ గోపి, ననువాల ప్రతాప్ రెడ్డి, గూడ పద్మ, జేరిపోతుల జనార్ధన్, సంగెం మధు, అయిలేని మల్లారెడ్డి, గంభీరపు మధు, ఏలూరి స్వాతి తదితరులు పాల్గొన్నారు.