20న ఛలో హైదరాబాద్‌

లంబాడీ హక్కుల పోరాట సమితి
రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌నాయక్‌
నవతెలంగాణ-దోమ
ఈ నెల 20న ఛలో హైదరాబాద్‌ ఇందిర పార్క్‌ వద్ద ధర్నాను విజయవంతం చేయండని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌ నాయక్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దిర్సంపల్లి తండాలో కరప త్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజ లారా ప్రజాస్వామిక వదులార రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజలను విచ్ఛిన్నం చేయడానికి పన్నాగం పన్నిం దనీ అందులో భాగంగానే 11 బీసీ కులాలను రూ.35 లక్షల జనాభాను ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఫిబ్రవరి 10న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి గిరిజనులపై కుట్ర పన్నిందన్నారు. ఈ 11 బీసీ కులాలను ఎస్టీ జాబితా లో చేర్చినట్లు అయ్ణ్చిాలని చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎస్టీల 10 శాతం రిజ్వేషన్ల ను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్‌లో చేర్చాలనీ, ఎస్టీ ఆదివాసీ గిరిజన ప్రజలు సాగు చేసుకుంటున్న పొడు లావ ణి భూములకు పట్టాలు పంపిణీ చేయాలన్నారు. ఎస్టీల తండా గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయ తీలుగా ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీల గ్రామ పంచాయ తీల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి బడ్జెట్‌ కేటా యించాలన్నారు. గిరిజన ప్రజలు, మేధావులు, యువకు లు, విద్యార్థులు ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమం లో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోవింద్‌ నాయక్‌, మండల కార్యదర్శి ఉప్ప సర్పంచ్‌ మోతీ లాల్‌ నాయక్‌, వార్డుమెంబర్‌ దానిబాయీ, హరినాయక్‌, దేవ్లిబాయి, రాములునాయక్‌, పాండు నాయక్‌, మోహన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.