– రెండేండ్ల కాల పరిమితితో ఎన్నికలు నిర్వహించాలి
– కాంట్రాక్టు కార్మికులకు ఓటుహక్కు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించాలి
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణిలో కూడా డిసిప్లేన్‌లో మార్పులు చేసి రెండేండ్ల కాల పరిమితిలో ఎన్నికలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని, సింగరేణిలో కార్మిక సంఘాలు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సింగరేణి సంస్థలో 1998 నుండి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించటం కార్మికుల ప్రజాస్వామిక హక్కుని కార్మిక సంఘాలన్నీ భావించాయి. గుర్తింపు ఎన్నికలు సింగరేణిలో జరపడానికి మేము వ్యతిరేకం కాదు. చట్ట వ్యతి రేకమైన అప్రజాస్వామీక మైన కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌ను సవరించాలని, చట్టబద్ధ కార్మిక సంఘాల హక్కులైన సభ్యత చేర్పింపు, సమావేశాల నిర్వహణ, గేట్ మీటింగులు, అధికారులతో చర్చలకు తగిన ప్రాధాన్యతతో కూడిన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలని సింగరేణిలో కార్మిక సంఘాలన్ని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ సింగరేణిలో అన్ని కార్మిక సంఘాల చట్టబద్ధ హక్కులను నిర్మూలించి సంఘాలకు మనుగడ లేకుండా చేసేందుకు గెలిచిన ఒకటి రెండు సంఘాలకు మాత్రమే సర్వాధికారాలు కల్పించేందుకు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రూపొందించారు. వివిధ ఎన్నికల సందర్భాల్లో ప్రమాద కరమైన కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌ను మార్చాలని కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ వచ్చాయి. కనుక ఈ ఎన్నికలకు ముందే కోడ్ ఆఫ్ డిసిప్లిన్‌ను మార్చాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాలను ఎన్నికలకు ముందే ఫైనల్ చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని సింగరేణిలో 12 కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు కోరుతున్నాయి.