వీటితో అనారోగ్యాలకు చెక్‌

 Check for diseases with theseమన వంటగదిలో సులభంగా దొరికే పదార్థాలు న్యాచురల్‌ యాంటీబయాటిక్‌గా పనిచేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ పదార్థాలు మనలోని ఇమ్యూనిటీని బూస్ట్‌ చేయడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతాయి. అవేంటో చూద్దాం…
వెల్లుల్లి : ఇవి వంటకు మంచి రుచిని ఇవ్వడం మాత్రమే కాకుండా.. దీనిలోని శక్తివంతమైన ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెల్లుల్లిలో అలిసిన్‌ అనే శక్తివంతమైన యాంటీమైక్రోబయల్‌ సమ్మేళనం ఉంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోజూ వారి ఆహారంలో వెల్లుల్లి చేర్చుకుంటే.. అనారోగ్యాలతో సమర్థవంతంగా పోరాడవచ్చు.
అల్లం : ఇందులోని ఘాటైన సుగంధ తైలాలు జీర్ణ వ్యవస్థకు వచ్చే ఇబ్బందులని తగ్గిస్తాయి. అల్లానికి రక్తంలో కొవ్వుని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగ పడతాయి. టేబుల్‌ స్పూన్‌ తేనెలో కొన్ని అల్లం రసం చుక్కల్ని కలుపుకోని తాగితే ఇమ్యూనిటీ బూస్ట్‌ అవుతుంది.
బొప్పాయి : బొప్పాయిలో బోలెడన్ని విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే పపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే కెరోటినాయిడ్లూ, ఫైబర్‌ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
గుమ్మడి గింజలు : ఈ చిన్న గింజ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పరాన్నజీవులతో పోరాడగలికే.. శక్తివంతమైన అమైనో యాసిడ్స్‌ ఉంటాయి. వీటిల్లో విటమిన్‌ కె, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, ఐరన్‌, జింక్‌, రాగి దండిగా ఉంటాయి. వీటిలోని కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ దుష్ప్రభావాల నుంచి మనల్ని రక్షిస్తాయి.
కొబ్బరికాయ : కొబ్బరిలో మీడియం చైన్‌ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి పరాన్నజీవులతో పోరాడతాయి. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, ఇన్‌ఫెక్షన్‌లకు వ్యతిరేకంగా పోరాడతాయి. వంట కోసం కొబ్బరి నూనెను ఉపయో గించండి, హైడ్రేషన్‌ కోసం కొబ్బరి నీటిని ఆస్వాదించండి, మీ వంటలలో తాజా కొబ్బరిని ఆస్వాదించండి.
పసుపు : వంటకాల్లో పసుపు వేస్తాం. ఇది వాటికి రంగూ, రుచిని అందిస్తుంది. దీనిలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్‌ గుణాలుం టాయి. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు జబ్బుల బారిన పడ కుండా చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే.. అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది.