రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి మహారాజ్‌

బీఎస్‌పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ బోయిని చంద్రశేఖర్‌ ముదిరాజ్‌
నవతెలంగాణ-తాండూరు
రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్‌ అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేట ర్‌ బోయిని చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ అన్నారు. సోమవారం తాండూరు పట్టణ కేంద్రంలోని డీఎస్‌పీ కార్యాల యంలో కొల్హాపూర్‌ సంస్థానాదిశలు ఛత్రపతి సాహుజి మహారాజ్‌ జయంతి ఉత్సవాలను బీఎస్‌పీ రాష్ట్ర కోఆర్డి నేటర్‌ బోయిని చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా 1902లో అన్ని కులాలకు ఆస్తి హక్కును కల్పించిన వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్‌ అని తెలిపారు. అదేమా ర్గంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆర్టికల్‌ 340 ద్వారా బీసీలకు ప్రత్యేకమైన హక్కులు కల్పించారన్నారు. బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్‌ కాన్సిరాం మండల కమిషన్‌ లాగు కరోవర్ణ కుర్చీ కాలీ కరో అని ఢిల్లీలోని బోట్స్‌ క్లబ్‌ వద్ద 45 రోజుల ధర్నా తర్వాత మండల్‌ కమి షన్‌ సిఫారసులను అమలు చేశారన్నారు. ధర్నాతోనే బీసీలకు స్థానిక సంస్థలో రాజకీయ రిజర్వేషన్లు రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ కన్వీనర్‌ అంజాద్‌ అలీ పాషా , తాండూర్‌ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ దొ రశెట్టి సత్యమూర్తి, అధ్యక్షులు అరుణ్‌ రాజు,యాలాల్‌ మండల కన్వీనర్‌ రాజు నాయక్‌, పార్టీ నాయకులు వెం కట్‌, పాండు ముదిరాజ్‌, వినోద్‌, జట్టుర్‌ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.