
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఐసిడిఎస్ పీడీకి వినతి పత్రం ఇచ్చి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. 38 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులకు టీ.ఏ,.డీ.ఏ,లు ఇవ్వకుండా ఉన్నారని అదేవిధంగా ఇవ్వక పోవటంతో ఇంటి యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని అదేవిధంగా కరోనా సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల నుండి కోతలు పెట్టిన వేతనాల్లో వెయ్యి రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదని పెరిగిన వేతనాల్లో ఒక నెల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని వారు కోరారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయాలని బిఎల్ఓ డ్యూటీలకు ఆయాలు లేని కేంద్రాలకు , అనారోగ్యంతో ఉన్నవారికి వయసు పైబడిన వారికి బిఎల్ఓ విధుల నుంచి మినాయింపు ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి చంద్రకళ జిల్లా నాయకులు ఎలిజిబెత్ రాణి గోదావరి, విజయ, లక్ష్మి తదితరులతోపాటు తదితరులతోపాటు నాయకులు పాల్గొన్నారు.