నవ తెలంగాణ-తాడ్వాయి
వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆదివారం రోజున కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేను ప్రధానమైన రెండు డిమాండ్లను నెరవేర్చాలని కోరారు 28 రోజులుగా వివోఏలు సమ్మె చేస్తున్నారు మీ తరఫున వివో లను పర్మినెంట్ చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరడం జరిగింది మరియు కామారెడ్డిలో సీసీలు వివో లను బెదిరింపు చార్య చర్యలకు పాల్పడుతున్నారని ఇవి తక్షణమే ఆపాలని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది వారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే పిడి.ఏపీఎంలను. సీసీలు లు బెదిరింపు చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటానని వారు హామీ ఇచ్చారు అలాగే ప్రభుత్వానికి నా తరఫున ఆపిల్స్ చేస్తానని వారు మాట ఇచ్చినారు ఎమ్మెల్యే కు సిఐటియు జిల్లా కమిటీ తరఫున ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె రాజనర్సు సిఐటియు అధ్యక్షులు టౌన్ కామారెడ్డి ఐటీపీ వివో ఏ ల జిల్లానాయకులు శివరాం బాలరాజు సరిత శివా రాజలింగం అనసూయ సురేందర్ మల్లేష్ ఉమాకాంత్ ఖండేరావు రవి షాహిన్ షా బేగం నిర్మల పద్మ కిషోర్ శీను నాయక్ ఆంజమ్మ. రాజు.సురేష్ తదితరులు పాల్గొన్నారు.