వడదెబ్బతో సివిల్‌ సప్లరు హమాలీ మృతి

నవతెలంగాణ-భైంసా
నిర్మల్‌ జిల్లా భైంసాలో వడదెబ్బకు గురైన సివిల్‌ సప్లరు హమాలీ కార్మికుడు గురువారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షేక్‌ అస్లాం(52) 20 సంవత్సరాలుగా సివిల్‌ సప్లరు గోదాంలో పని చేస్తున్నాడు. ఎండల వల్ల వడదెబ్బకు గురయ్యాడు. గురువారం మిర్జాపూర్‌ గ్రామంలోని రేషన్‌ షాపులో పని చేస్తున్న క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తోటి కూలీలు అతడిని భైంసా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.