నవతెలంగాణ-వైరా
మునిసిపాలిటీలో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాలను నిర్వహణలో బాగంగా ఆదివారం కొన్ని వార్డులలో శ్రమదానం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ లోని అన్ని వార్డ్‌ల్లో ప్రజలందరూ ప్రతి ఒక్కరూ చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరం అయితే శ్రమదానం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా వైరా పట్టణాన్ని సుందరంగా, మురికి, చెత్త రహితంగా తీర్చిదిద్దటంలో అందరి సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పితాని వెంకటేశ్వర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ సైదులు, వార్డ్ ఆఫీసర్ అశోక్, మురళి, జవాన్, మున్సిపల్ సిబ్బంది వార్డ్ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఠాగూర్ విద్యాసంస్థల్లో స్వచ్ఛత సేవా కార్యక్రమం
వైరాటౌన్ : స్థానిక ఠాగూర్ విద్యా సంస్థలకు చెందిన క్రాంతి జూనియర్ కళాశాల, ఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో క్లీన్ అండ్ గ్రీన్, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సేకరించటం సదరు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాచరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ నిల్వ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల మూలంగా పర్యావరణానికి హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత, డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణారావు, ఎన్‌ఎస్‌ఎస్ పిఓ లింగారావు, అధ్యాపకుల మజీద్, విద్యార్థులు పాల్గొన్నారు.
తల్లాడ : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారుగూడెం సర్పంచ్ మారెళ్ళ మమత అన్నారు. ఆదివారం గ్రామంలో శ్రమదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 1 తేదీ స్వచ్ఛత కార్యక్రమం భాగంగా గ్రామంలో చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ హుస్సేన్, పంచాయతీ సెక్రటరీ పోరాల్ల వేణు, వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్లు గ్రామపంచాయతీ పాల్గొన్నారు.
కామేపల్లి మండలంలో స్వచ్ఛత హీ ఈ కార్యక్రమం
నతెలంగాణ-కామేపల్లి
మండలం ప్రభుత్వ అధికారులు వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో కలిసి వాడ వాడల స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారీ ర్యాలీలు నిర్వహించీ నినాదాలు పెద్దపెట్టన చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ నెల్లూరు చందన, డాక్టర్ శిరీష మాట్లాడుతూ పరిసరాల శుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరు పరిసరాల శుభ్రతను పాటించాలని కోరారు. కామేపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బోనకల్: మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో స్వచ్హత హే సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామస్తులు అందరూ శ్రమదానం చేశారు. రోడ్లు శుభ్రం చేశారు. రోడ్ల పక్కన గల ప్లాస్టిక్ నిషేధం, పిచ్చి మొక్కలు తొలగింపు, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలోని అన్ని వీధులు తిరుగుతూ స్వచ్ఛ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలొ ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, గ్రామ సర్పంచ్ నోముల వెంకటనరసమ్మ, ఉపసర్పంచ్ తుళ్లూరు కొండలరావు, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండలో స్వచ్ఛత హీ సేవ
ముదిగొండ : ముదిగొండలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రధాన సెంటర్లో ప్రతిజ్ఞ చేసి రోడ్డుకు ఇరువైపులా చీపిర్లతో ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకెపి, ఆశా, అంగన్వాడీ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మధిర : మండల పరిధిలోని ఆత్కూరు గ్రామంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అబ్బూరి సంధ్యా రామకృష్ణ పిలుపు మేరకు గ్రామ ప్రజలు శ్రమదానంలో పాల్గొని తమ ప్రాంతాలను పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంభంపాటి చిట్టి బాబు, డీలర్ మీనుగు శంకర్, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మధిర : స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాలిటీలో ఆదివారం చైర్ పర్సన్ మొండితోక లత, కమిషనర్ రమాదేవి, హెల్త్ అసిస్టెంట్ రేవతిలు చీపిరి పట్టి శ్రమదానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరిసరాల శుభత్ర లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని తెలిపారు. స్వచ్ఛతాహి కార్యక్రమం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బిక్కి అనిత, వంకాయలపాటి నాగేశ్వరరావు, రైతు సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్, కపిలవాయి జగన్మోహన్ రావు, మున్సిపల్ మేనేజర్, వార్డు ఇన్‌ఛార్జీలు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శ్రమదానం
ఖమ్మం : నగరంలోని మామిళ్లగూడెం డీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 1, 2 ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వన్ అవర్ శ్రమదానం, స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ట్రైన్ ట్రాక్ రోడ్డులో ఇరువైపుల పెరిగిన చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ వి .మోహన్ రెడ్డి, చైర్ పర్సన్ శోభారెడ్డి, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, అధ్యాపకులు యాదగిరి, శ్రీను, బి.వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మధిర : మధిర ఆసుపత్రిలో ఆదివారం స్వేచ్ఛ భారత్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ యండీ .అనిల్ కుమార్, డాక్టర్ రాజా విజయకృష్ణ, డాక్టర్ వెంకటేశ్వర్లు, హెచ్ ఎన్, సిస్టర్స్ స్టాఫ్ నర్స్‌లు, హాస్పటల్ స్టాప్ అందరు పాల్గొన్నారు.
కారేపల్లి : స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కారేపల్లి, మాధారం గ్రామాల్లో శ్రమదానంతో వీధులను శుభ్రం చేశారు. మండల కేంద్రమైన కారేపల్లిలో రహదారికి ఇరువైపు చెత్తను తొలగింపు, మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎంపీడీవో చంద్రశేఖర్ ప్రారంభించారు. మాధారం గ్రామంలో సర్పంచ్ అజ్మీర నరేష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు శ్రమదానం చేశారు. గ్రామస్తులతో స్వచ్చా ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కార్యదర్శులు యాకలక్ష్మి, నరేష్, వీఏవో కుర్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు.