కోటిన్నరకు చేరువలో కంటి పరీక్షలు..

 21,29,865 మందికి రీడింగ్‌ గ్లాసెస్‌ పంపిణీ :
సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు కోటిన్నరకు దగ్గరలో ఉన్నాయి. ఈ మేరకు శనివారం సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక కోటి 49,11,072 మందికి పరీక్షలు పూర్తయినట్టు తెలిపారు. వీరిలో 21,29,865 మందికి ఉచితంగా రీడింగ్‌ గ్లాసెస్‌, ఔషధాలను పంపిణీ చేశారు.
70,09,827 మంది పురుషులకు, 78,91,704 మంది మహిళలకు కంటి పరీక్షలను చేశారు. జూన్‌ 15 వరకు కొనసాగనున్నట్టు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నివారించదగ్గ అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంలో భాగస్వాములు కావాలని సూచించారు.