బీజేపీది హౌల్‌ సేల్‌ అవినీతి

 సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూఢిల్లీ : దేశంలో బీజేపీ ప్రభుత్వం హౌల్‌సేల్‌ గా అవినీతికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. బీజేపీ రాబోయే ఎన్నికల కోసమే రూ.2000 నోట్ల చెలామణి నిలుపుదలకు ప్రణాళిక రచించిందన్నారు. శనివారం నాడిక్కడ నారాయణ మీడియాతో మాట్లాడారు. నిజంగానే మోడీ ప్రభుత్వానికి బ్లాక్‌ మనీని అంతం చేయాలని చిత్తశుద్ధి ఉంటే రూ.రెండు వేల నోట్లను వెంటనే రద్దు చేయాల్సి ఉండేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు బ్లాక్‌ మనీ ఉన్నవాళ్లందరికీ సహాయం చేసేందుకే ముందస్తు ప్రణాళికకు మాత్రమే మోడీ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు.
రూ.500, రూ.1,000 రద్దు సమయంలో కోట్ల నల్లధనం వైట్‌ మనీగా మారిందని విమర్శించారు. ప్రస్తుతానికి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజంగా మోడీ ప్రభుత్వానికి బ్లాక్‌ మనీ అంతం చేయాలని చిత్తశుద్ధి ఉంటే, మార్చుకునే అవకాశం ఇవ్వకుండా ఉండేదన్నారు. కుస్తీ వీరులు ఢిల్లీ రోడ్లపై కొచ్చి ఆందోళన చేస్తున్న మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అంతర్జాతీయంగా క్రీడల్లో రాణించి పథకాలు సాధించిన మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love