ప్రేమ మేఘం

cloud of loveఒక మేఘంలా తాను నాపై
ప్రేమ వర్షాన్ని కురిపించినపుడు
నా పెదవంచుల తేనె చిగురు పూస్తుంది

నా గుండెకు దగ్గరగా చేరినపుడు
తన శ్వాసా రవళి చెవిని తాకుతుంటే
కొమ్మల్లో రక్తం నింపుకున్న గులాబీలా
హదయం వికసిస్తుంది

నల్లని దెయ్యం లాంటి చీకటిలో
ఆమని లా విరబూసిన తన చూపులు
తీయని రాగాలు మోసుకొచ్చి
శ్వాసలో ఏకమైపోతాయి

ప్రతీ క్షణం నన్ను చీల్చి చెండాడే ఈ లోకం
నా దరికి రాదాక్షణం
మరో లోకం లో మమ్మల్ని ఒంటరిని చేస్తుంది
దారి తప్పుతూ తీరం వెతుక్కుంటాం ఆ క్షణం
– పి.సురేంద్ర, 9346704966