వడిత్య పాండు మరణం పట్ల సీఎం సంతాపం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
చెరువుల పండగ సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం దాసరి నెమిలిపూర్‌ గ్రామానికి చెందిన వడిత్య పాండు ప్రమాదంలో మరణించడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌ అభ్యర్థన మేరకు పాండు కుటుంబానికి రూ.ఐదు లక్షల ఎక్స్‌ గ్రేషియాను ప్రకటించారు.