సీఎం కప్ 2023 క్రీడలలో ప్రతిభ కనబరిచిన గురుకుల కళాశాల విద్యార్థిని

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నాగారంలోని గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్న జి. భార్గవి (ఎమ్మెస్సీ ఎస్) కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫర్ ది పేట గ్రామంలో సీఎం కప్ 2023 క్రీడా విభాగంలో కబడ్డీలో మొదటి బహుమతి బాజీ భార్గవి టీం అందుకున్నారు. బెస్ట్ ప్లేయర్ అవార్డు సర్టిఫికెట్ కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా చేతుల మీదుగా భార్గవి అందుకున్నారని నిజామాబాద్ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సైదా జైనాబ్ తెలియజేశారు. అలాగే విద్యార్థిని భార్గవిని తమ కళాశాల తరపున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.