నవతెలంగాణ-తాడ్వాయి : మండలంలోని నార్లాపూర్ లో సోమవారం గ్రామ సర్పంచ్ సిద్ధబోయిన చిన్నక్క, ఎంపీటీసీ కుక్కల శ్రీను ల ఆధ్వర్యంలో క్రీడాకారులకు సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సీఎం కెసిఆర్ స్పోర్ట్స్ స్కిట్స్ అందజేసి, గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామానికి, మున్సిపల్ వార్డుకు ఓ సమగ్ర స్పోర్ట్స్ కిట్ ను రాష్ట్ర ప్రభుత్వం అందించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం అని అన్నారు. క్రీడారంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలవటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రతన్ సింగ్, పంచాయతీ కార్యదర్శి అజ్మీర ధర్మేందర్, ప్రజా ప్రతినిధులు క్రీడాకారులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.