సీఎం కేసీఆర్‌ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగం

– జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు; కోహిర్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ స్వప్న
నవతెలంగాణ-పెద్దేముల్‌
సీఎం కేసీఆర్‌ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగంలా కనిపిస్తుందని జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు,పెద్దేముల్‌ మండల్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కోహిర్‌ శ్రీనివాస్‌ కొనియా డారు. మంగళవారం మండల పరిధిలోని జనగాం గ్రామం లో పెద్దేముల్‌ పశువైద్య డాక్టర్‌ వెంకట్‌ రాజు నేతృత్వంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కోహిర్‌ శ్రీనివాస్‌, ఎంప ీటీసీ స్వప్న, తాండూర్‌ నియోజకవర్గ అధ్యక్షులు నాగారం జగదీష్‌, ఉపాధ్యక్షులు పూజారి పాండు గొర్రెల అభివృద్ధి పథకంలో భాగంగా రెండో విడత సబ్సిడీ గొర్రెలను పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల కుల అభివృద్ధికి ఎనలేని ప్రోత్స హం అందిస్తుందన్నారు. గొల్ల కురుమ సంఘాల ఎదుగుద లకు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమ సంఘాలకు ఒక్క యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు సబ్సిడీపై లబ్దిదా రులకు అందజేస్తున్నట్లు వివరించారు. గొర్రెల అభివృద్ధి పథకంలో భాగంగా రెండో విడతలో 12 మంది లబ్దిదారు లకు గాను, 240గొర్రెలు, 12 పొట్టేలు పంపిణీ చేస్తున్నట్లు పశు వైద్య డాక్టర్‌ వెంకట్‌ రాజు వెల్లడించారు. మండలం లో దశలవారీగా ఇంకా 407 మంది కురుమ సంఘం లబ్ది దారులకు త్వరలో గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిలు రంగయ్య, మాజీ సర్పంచ్‌ రవీందర్‌ నాయక్‌, ముకుంద్‌ రెడ్డి, డివై ప్రసాద్‌, బంగ్లా రఘు, కురుమ సంఘం లబ్దిదారులు అనిల్‌, గోపా ల్‌, లక్ష్మప్ప, శ్రీనివాస్‌, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.