నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కార్మికులకు, అధికారుల 2019-20 సంవత్సరానికి సిఎంపీఎప్ వడ్డీ రేటు 8.5 శాతం బదులు 8 శాతం చెల్లింపు చేసిన సంగతి విదితమే దీనిని సిఐటియు గుర్తించి పోరాటం చేసిన ఫలితంగా సిఎంపీఎప్ వడ్డీ రేటు 0.5 శాతం సిఎంపీఎప్ ఖాతాలో జమ అయ్యిందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు పేర్కొన్నారు. గత సంవత్సరం ఇచ్చిన సిఎంపీఎప్ చిట్టిలో కేవలం ఒక్క శాతం ఒక్క సంవత్సరానికి సంబంధించిన వడ్డీని జమ చేశారని, 2019-20 సంవత్సరానికి గాను జమ చేయడంలో జరిగినలోపాల్ని సరిచేయాలని సిఐటియు చేసిన డిమాండ్ మేరకు ఎట్టకేలకు ఈ సంవత్సరం ఇచ్చే సీఎంపిఎఫ్ వివరాలలో ప్రాథమిక నిలువలో 0.5 శాతం కలిపి ఇస్తున్నట్లు సీఎం పిఎఫ్ అధికారులు తెలిపా రన్నారు. ప్రతి కార్మికుడు కొత్త గూడెం రీజయన్‌లో వారందరికీ అధికారులతో సహా లక్షకు రూ.5000 చొప్పున ఎన్ని లక్షలు ఉంటే అన్ని రూ.5000 ఈ సంవత్సరం ఇచ్చే స్లిప్‌లో కలిపి చూపెడుతున్నారని తెలిపారు. కావున కార్మికులు గత సంవత్సరం పొందిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ లబ్ధి కొత్తగూడెం రీజియన్‌లో వారికి లబ్ధి పొందారని అన్నారు. కొత్తగూడెం రీజియన్‌లోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాలలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు, అధికారులు ఈ విషయాలను తమ తమ నిల్వలు చూసుకొని సరిగా వచ్చేయా లేదో చూసుకోవాలని, లెక్కలు సక్రమంగా రాని పక్షంలో వాటిని సరి చేయించుకో వడానికి సీఎంపిఎఫ్ అధికారులను సంప్ర దించాలన్నారు. గత సంవత్సరం ఈ సంవత్సరం మొత్తంగా ఒక్కొక్క కార్మికుడికి అధికారులకు లక్షకు వెయ్యి రూపాయల చొప్పున ఎన్ని లక్షలు ఉంటే అన్ని వేల రూపాయలు సిఐటియు కృషి ఫలితంగా కార్మికులకు ప్రయోజనం చేరుకూరినట్లు నర్సింహారావు తెలిపారు.