సీఎం రిలీఫ్ ఫండ్ పేదోడికి అండ..

నవతెలంగాణ – ధర్మసాగర్
ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని ముప్పారం గ్రామ పరిరక్షణ కమిటీ కన్వీనర్ గుంటిపల్లి రేణుక అన్నారు. బుధవారం మండలంలోని ముప్పారం గ్రామలో ముప్పారం గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముప్పారం గ్రామానికి చెందిన తాళ్లపల్లి గట్టయ్య, ముంజ ఝాన్సీ ఆరోగ్య వైద్య ఖర్చుల కింద దరఖాస్తు చేసుకోగా 1,12,000/ నిధులు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం తాళ్లపల్లి గట్టయ్యకు మోకాలు ఆపరేషన్ సందర్భంగా వైద్య చికిత్సల కింద ఖర్చుకాగా ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయార్థం రూ లక్ష మంజూరు కావడం జరింగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముంజ ఝాన్సీ కి రు.1,12000/ వైద్య ఖర్చుల కింద మంజూరు చేయించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ముప్పారం గ్రామ పరిరక్షణ సమితి సభ్యులు వెంకట్, గ్రామ పెద్దలు కోతి సాంబరాజు గౌడ్, యతి రాజుల మల్లయ్య, చిలువేరు రఘు, కానుగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.