– విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
– దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబురాలు
నవతెలంగాణ-కందుకూరు
రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని రాచులూర్ గ్రామ రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్దది అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 3 ఏళ్లలో కేసీఆర్ పూర్తి చేశారని గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో ఇంకా ఒక ప్రాజెక్ట్ కొనసాగుతూనే ఉందన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేసి గుర్తు చేశారని తెలిపారు. మంచి బోజనం పెట్టి, అందరికి అన్నం పెట్టే రైతులను గౌరవించాలని సూచించారని తెలిపారు. ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఆరోపణలు చేసే వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. గతంలో ఎరువుల కోసం చెప్పుల లైన్లు, పోలీసుల సహాయంతో పంపిణీ చేసే వారన్నారు. కానీ నేడు సకాలంలో కావాల్సిన ఎరువులను ఎంత అవసరం ఉంటే అంత రైతన్నలకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతూ పిడి యాక్ట్ నమోదు చేస్తూ కర్షకులు నష్టపోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్నారు. రైతు బంధు ద్వారా రైతులకు బ్యాంకు ఖాతాలలో క్రమం తప్పకుండా డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో 33,517 ఎకరాలాలో 352 కోట్లు ఇప్పటివరకు రైతులకు రైతు బంధు అందించినట్టు తెలిపారు. గుంట భూమి ఉన్న రైతు అయిన అకస్మాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో 354 మంది చనిపోతే 22 కోట్లు ఇప్పటి వరకు అందజేసినట్టు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 1400 కోట్లు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుందన్నారు. పనిచేసే ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత లాభం రైతన్నలకు చేకూరుతుందో అందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సహాయ సహకారాలతో నేడు వరి ధాన్యంలో మన రాష్టం పంజాబ్ ను దాటి అందరికి అన్నం పెట్టె అన్నపూర్ణగా మారిందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు. 21 రోజులు రోజులపాటు జరిగే తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు . కార్యక్రమంలో జడ్పిటిసి బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సహకార సంఘం ఉపాధ్యక్షులు విజయేందర్ రెడ్డి, కందుకూరు ఆర్డీవో సూరజ్ కుమార్, తహసీల్దార్ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో వెంకట రాములు, సర్పంచులు గోవర్ధన్, శ్రీలత శ్రీహరి, రాము , గోపాల్ రెడ్డి, మంద సాయిలు, గోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు రాజశేఖర్ రెడ్డి, ఇందిరా దేవేందర్, మంచాల యాదయ్య, రైతుబంధు మండల అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సోలిపేట అమరేందర్ రెడ్డి, డైరెక్టర్లు సాదా పాండురంగారెడ్డి, పొట్టి ఆనందు, బీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మన్నే జయేందర్, నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.