మొండి వీరన్న తండాలో శీతల ఉత్సవాలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని గొడుగు మర్రి తాండ గ్రామపంచాయతీ పరిధిలో మొండి వీరన్న తండాలో మంగళవారం శీతల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలతో, గిరిజన ఆరాధ్య దైవం శీతల దేవునికి నైవేద్యం, బోగుబాండాను సమర్పించి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రవంత పరమేష్, గిరిజన తాండ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.