కలెక్షన్లు పెరుగుతున్నారు

కలెక్షన్లు పెరుగుతున్నారుహన్సిక ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శతి’. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మించారు. ఈనెల17న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్‌ మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ, ‘ఇప్పటి వరకు ఇటువంటి నేపథ్యంలో సినిమా రాలేదు. స్కిన్‌ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, సక్సెస్‌ చేసినందుకు ప్రేక్షకులకు, ధన్యవాదాలు. రోజురోజుకు కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. ఇందులో మంచి మెసేజ్‌ కూడా ఉంది’ అని అన్నారు. ‘ఈ కథ చెప్పే సమయంలో హన్సికకి ఒక ప్రామిస్‌ చేశాను. తన బెస్ట్‌ 10 మూవీస్‌లో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. ఈ రోజు ఈ సినిమాకు వస్తున్న రివ్యూలు, రేటింగ్‌లు చూస్తుంటే.. నేను నా ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. పేరేంట్స్‌ పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’ అని దర్శకుడు శ్రీనివాస్‌ ఓంకార్‌ చెప్పారు.