నవతెలంగాణ-ఓయూ
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టి) సౌజ న్యంతో ఓయూ వృక్ష శాస్త్ర విభాగం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ”సినర్జిటిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యుటిలైజింగ్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజీకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (స్తుతి)-2023” వర్క్‌షాప్ గురువారం ప్రారంభమైంది. ఓయూ సైన్స్ కళాశాలలోని ప్రిన్సిపాల్ ఆఫీస్ సెమినార్ హాల్లో జరిగిన ఈ సదస్సుకు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.బి. వీరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిలుగా ఓయూ యూజీసీ డీన్ ప్రొ.జి.మల్లేశం, నీట్ వరంగల్ ప్రిన్సిపాల్ సైంటిఫిక్ ఆఫీసర్ డా.టి.కె.సాయి, సదస్సు కన్వీనర్, వక్ష శాస్త్ర హెడ్ ప్రొ.బి.రమాదేవి, సదస్సు కో-ఆర్డినేటర్, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతి ప్రొ.కె.శైలజ హాజరయ్యా రు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ”ఓ యూలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేయడానికి అవసరమైన అత్యంత ఆధునాతన పరికరాలు ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు చేస్తూ ఓయూ దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల సరసన నిలబడింది. లైఫ్ సైన్సెస్ రంగంలో పరిశోధకులు అధునా తన పరికరాలను ఉపయోగించి పరిశోధనలు చేయడానికి స్తుతి లాంటి వర్క్‌షాప్‌లు మంచి అవకాశం. విద్యార్థులు, పరిశోధకులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు దేశానికి ఉపయోగపడే పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణలు చేయాలని అప్పుడే దేశం పురోగతి సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రొ.సబిత, డా.కిరణ్, డా.సయేద అజీమా, డా. సుమన్, డా.రఘు, పరిశోధకులు నీత, కవిత, డా.రవి చంద్ర, డా.గాజుల ప్రభాకర్, రమేష్ నాయక్, బోధనేతర సిబ్బంది వివేక్ కుమార్, బషీర్, తదితరులు పాల్గొన్నారు.