రాగి జావ పంపిణీ ప్రారంభం…

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన విద్యా దినోత్సవం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాలలను అలంకరించి విద్యార్ధులు చే పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.ముందుగా పాఠశాలలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేసారు. రాగి జావ పంపిణీకి ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామ మూర్తి జావ పంపిణీని లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఇ.ఒ క్రిష్ణయ్య,ప్రధానోపాధ్యాయులు నరసింహారావు,బోధనా సిబ్బంది రాంబాబు,అప్పారావు,గణేష్,విశ్రాంత ఉపాధ్యాయులు యు.ఎస్ ప్రకాశ్,నాయకులు సత్యవరపు సంపూర్ణ లు పాల్గోన్నారు.