
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం అధిక శ్రావణమాస సప్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో అధిక మాసం నెలరోజులపాటు సప్త కొనసాగుతుందని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ కాబోయే చైర్మన్ కాశీనాథ్ పటేల్ తెలిపారు. సప్త ప్రారంభోత్సవ కార్యక్రమంలో సలాబత్పూర్ గ్రామ సర్పంచ్ షేక్ గఫర్ హెచ్ కేలూర్ ఎంపీటీసీ సభ్యులు విజయ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్ మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ ఆలయ అధికారి వేణు ఆలయ మహారాజులు అరవింద్ శరత్ ఆలయ గుమస్తా కల్పన గిరీష్ దేశాయ్ శ్రీపద్ అశోక్ భజన మండలి వార్కార్లు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.