జీవితంలో విజయ శిఖరాలను అందుకోవా లంటే చాలామంది తాము తెల్లవారక ముందే లేవడమని అభిప్రాయపడతారు. ఉదయమా..! రాత్రా..! ఎప్పుడైన సరే మనం చేసే పనిలో అంకిత భావం ఉండాలన్నది మరికొందరి అభిప్రాయం. అయితే పగలు పని చేస్తే మంచిదా.. లేక రాత్రి పని చేస్తే మంచిదా అనే దానిపై నిపుణులు ఏమంటు న్నారో ఓ సారి చూద్దాం!
చాలామంది ఉదయాన్నే లేవలేకపోతున్నా మని బాధ పడవద్దని రాత్రి వేళలే అనుకూలం అనుకుంటే ఆ సమయంలోనే ఎక్కువ పని చేయా లని సూచిస్తున్నారు. అలాగే ఏ సమయమైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ సమయానికే లేవం డని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అధ్యయనాల ప్రకారం రాత్రి వేళల్లో పనిచేసే వారిలో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌కి చెందిన శాస్త్రవేత్త టోసీ కనజావా రాత్రి మేల్కోని పరిశోధనలు చేశారు. వారు చేసిన పరిశోధ నల ప్రకారం పొద్దున్నే లేచేవారిలో ఐక్యూ అధికంగా ఉంటుందనే దానిపై ఆయన విభేదించారు. పూర్వ కాలంలో రాత్రి వేళల్లో పని చేయడానికి అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల ఉదయాన్నే మేల్కొని పనులు చేసుకునేవారు. ఈ అలవాటుగా తరాలుగా వస్తుండడంతో అదే మంచిదనే మంచిదనే అభి ప్రాయం వారిలో స్థిరపడిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మిలన్‌లో కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ సాక్రెడ్ హార్ట్‌కు చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనా లపై రాత్రిపూట పని చేసేవారు అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో నిష్ణాతులని తెలుసుకు న్నారు. ఇతరులకు భిన్నంగా ఆలోచించే తత్వం వారిలో ఉంటుందని పరిశోధనల్లో తేల్చారు. అదే విధంగా వేకువజామున చదివే వారికి కూడా మంచి గ్రేడ్లు సాధిస్తున్న విషయాన్ని కూడా వారు గమ నించారు. ఉన్నత స్థాయికి చేరినవారు ఎక్కువ జీతాలు అందుకుంటున్నవారు రాత్రి వేళ పనిచేసే వారేనని తేలింది. అంతేకాకుండా కఠిన సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడంలో వారు సిద్ధహస్తులని తేలింది.
జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న చాలా మంది ఉన్నత వ్యక్తులు రాత్రిపూట పని చేసేం దుకు ఇష్టపడేవారని తేలింది. చేసే పనిలో నిబద్ధత ఉండాలి కానీ సమయం, ముహూర్త ప్రభావం ఉండ దని నిపుణులు చేప్తున్నారు. ప్రపంచం నిద్రపోయాక ప్రశాంత వాతావరణంలో పని చేసి వారు మేటి ఫలితాలు సాధించాలనే దృక్పథం వారిలో ఉంటుం దని పరిశోధకులు చెప్పుతున్నారు.