– హైకోర్టులో మృతుడి వివాహిత సోదరి రిట్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కారుణ్య నియామకమంటే ఒక కుటుంబలోని వాళ్లే కాదనీ, ఆ కుటుంబంలోని సభ్యురాలికి వివాహం అయిన తర్వాత కూడా ఆ నియామక నిబంధనలు వర్తింపజేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ దాఖలైంది. ఈ మేరకు జార్కండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సింగరేణి కాలరీస్ అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ ఎం.దీప రిట్ వేశారు. తండ్రి సింగరేణిలో చేస్తూ మృతి చెందాడు. దీంతో ఆతని కొడుకు నరేష్‌కు కారుణ్య నియామకం జరిగింది. కొద్ది రోజులకే నరేష్ చనిపోయాడు. దీంతో అతని సోదరి అయిన తన కుమార్తె దీపకు ఉద్యోగం ఇవ్వాలని రోషిణి అప్లికేషన్‌ను సింగరేణి మేనేజిమెంట్ తిరస్కరించింది. దీంతో దీప వేసిన రిట్‌ను హైకోర్టు విచారించింది. జార్కండ్ హైకోర్టు తీర్పు కాపీతో తిరిగి సింగరేణికి దరఖాస్తు చేసుకుకోవాలని సూచించింది. 2 నెలల్లోగా ఆ అప్లికేషన్‌ను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది.