సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం అమలు చేయాలి 

– సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి 
నవతెలంగాణ- మద్నూర్ 
మద్నూర్ మండలంలో విధులు నిర్వహించే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు శుక్రవారం నాడు మండల తాసిల్దార్ కు ఒక వినతి పత్రాలు అందజేశారు తమకు రెగ్యులరైజ్ చేసి కనీస వేతనం అమలు చేయాలని తాసిల్దార్ కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రోజున సీనియర్ అసిస్టెంట్ రాచప్ప  సార్ కు విద్యా శాఖ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల  ఆధ్వర్యంలో  వినతిపత్రంను అందించారు. ఇందులో భాగంగా ఎస్. ఎస్. ఎ ఉద్యోగులను రెగ్యులరైజ్, కనీస  వేతనం  అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు