బొమ్మకల్లు లో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం

నవతెలంగాణ- పెద్దవంగర: మండలంలోని బొమ్మకల్లులో కాంగ్రెస్ నాయకులు పార్టీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేపట్టారు. టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్ అన్నారు. గురువారం గ్రామంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, యూత్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కొడకంటి యాకయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు మోతిరామ్ నాయక్, ప్రధాన కార్యదర్శి బీసు నాగరాజు, సీనియర్ నాయకులు ధరావత్ శంకర్, పొడిశెట్టి మల్లయ్య, రామ్మూర్తి, ఎరసాని శ్రీను, వెంకటమల్లు, సారయ్య, కాలేరు స్వామి, సోమయ్య, వీరయ్య, యాదగిరి, మల్లయ్య, ఎస్కే అన్వర్, బానోత్ శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.