వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

కాంగ్రెస్‌లో చేరిన 100 మంది బీఆర్‌ఎస్‌ నాయకులు
భూ కబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులు
మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం యాచారం మండల కేంద్రంలో ఉన్న టి ఎస్‌ ఆర్‌ గార్డెన్‌ లో కాంగ్రెస్‌ చేరికల సభను నిర్వహించారు. మండల పరిధిలోని కొత్తపల్లి తండా, మోగుల్లవంపు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నుంచి దాదాపు వందమంది నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారిలో సహకార సంఘం మాజీ చైర్మన్‌ సుదర్శన్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకురాలు అమత సాగర్‌, కొత్తపల్లి మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి లతో పాటు దాదాపు 100 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అండ చూసుకొని బీఆర్‌ఎస్‌ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎక్కడ ఖాళీ జాగాలు కనపడితే అక్కడ అధికార పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఒకసారి చదువుకున్న యువత ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. ఫార్మాసిటీతో ఇక్కడున్న నాలుగు గ్రామాలు పూర్తిగా ఆగమాగం అయ్యాయని విమ ర్శించారు. ఫార్మాసిటీని ఆపడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మైపాల్‌, శేఖర్‌ మామ, చిలుక మధుకర్‌ రెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ రెడ్డి, కొత్త కురుమ మంగమ్మ, మాజీ ఎంపీపీలు జ్యోతి శ్రీనివాస్‌ నాయక్‌, జయమ్మ, మస్కు నరసింహ, ఎంపీటీసీలు లక్ష్మీపతి గౌడ్‌, అరవిందు నాయక్‌, మాజీ వైస్‌ ఎంపీపీ గజ్జి రామకష్ణ, భాస్కర్‌ సేటు, మంకాల దాసు, లిక్కి పాండురంగారెడ్డి, మోటే శ్రీశైలం, వరికుప్పల సుధాకర్‌, రామకష్ణ, కోరే జంగయ్య, శేఖర్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.