– బెల్లయ్య నాయక్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ తాండాల్లో కాంగ్రెస్ నేతలు బస చేసి, అక్కడే నిద్రించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నేత బెల్లయ్య నాయక్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం మండలానికి రెండు తండాలను ఎంపిక చేసుకుని ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’ పేరుతో కార్యక్రమం చేపట్టాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కొమురం భీమ్, సేవాలాల్ మహారాజ్, ఇందిరాగాంధీ వంటి మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని విజ్ఞప్తి చేశారు.