జీపీ కార్మికుల సమస్యలు న్యాయమైనవే : కాంగ్రెస్ నాయకులు చెన్నకేశవరావు

– జీపీ కార్మికులకు కాంగ్రెస్ భోజన వితరణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి  27 వ, రోజుకు చేరింది.
ఈ ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులకు ఒక పూట భోజనం వితరణ చేసారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  మొగళ్ళపు చెన్నకేశవరావు,ఎంపీటీసీ లు వేముల భారతి ప్రతాప్, సత్యవరపు తిరుమల బాలగంగాధర్,మిండ హరిక్రిష్ణ, టి.పి.సి.సి నాయకురాలు వగ్గెల పూజ,జల్లిపల్లి దేవ రాజ్ తదితరులు పాల్గొన్నారు.